రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని అమరావతిలోనే నిర్మిస్తున్నాం: సోము వీర్రాజు

21-11-2021 Sun 16:21
  • అమరావతి ఒక్కటే రాజధాని అంటూ రైతుల పాదయాత్ర
  • మద్దతు పలికిన బీజేపీ
  • నెల్లూరు జిల్లాలో పాదయాత్రలో పాల్గొన్న బీజేపీ నేతలు
  • రైతులతో కలిసి ముందుకు సాగుతామన్న సోము
Somu Veerraju stated BJP state office will be constructed in Amaravathi
అమరావతికి మద్దతుగా ఏపీ బీజేపీ నేతలు నేడు రైతుల మహాపాదయాత్రలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కావలి వద్ద బీజేపీ, అమరావతి రైతుల ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహించారు. ఈ సభకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని ఉద్ఘాటించారు. ఈ మాటకు బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. అందువల్లే అమరావతిలో అనేక పనులకు కేంద్రం నుంచి నిధులు వచ్చాయని వెల్లడించారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని అమరావతిలోనే నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. రైతుల పాదయాత్రలో చివరి వరకు బీజేపీ పాల్గొంటుందని వివరించారు.