Amazon: తియ్యతియ్యగా... ఆన్ లైన్ లో గంజాయి విక్రయాలు... అమెజాన్ పై కేసు

Police files case on Amazon India executive directors
  • మధ్యప్రదేశ్ లో గంజాయి రాకెట్ గుట్టురట్టు
  • ఇద్దరి అరెస్ట్
  • 21.7 కిలోల గంజాయి స్వాధీనం
  • విశాఖ నుంచి అమెజాన్ ద్వారా సరకు తెప్పిస్తున్న వైనం
  • స్వీట్ నర్ విక్రయాల పేరిట ఆన్ లైన్ లో దందా
మధ్యప్రదేశ్ పోలీసులు ఇటీవల భారీ గంజాయి రాకెట్ ను ఛేదించారు. గ్వాలియర్ కు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి ఈ నెల 13న 21.7 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ అమెజాన్ ద్వారా సరుకును ఏపీలోని విశాఖ నుంచి తెప్పిస్తున్నట్టు గుర్తించారు. స్వీట్ నర్ అమ్మకాల పేరిట ఆన్ లైన్ లో ఈ తతంగం నడుస్తున్నట్టు వెల్లడైంది. ఈ అమ్మకాలకు వేదికగా నిలిచిన అమెజాన్ ఇండియా విభాగంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అమెజాన్ ఇండియా కార్యనిర్వాహక డైరెక్టర్లపై సెక్షన్ 38 (నార్కొటిక్స్ చట్టం) కింద కేసు నమోదు చేశామని భింద్ జిల్లా ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ వెల్లడించారు. విచారణకు సహకరిస్తామని అమెజాన్ ప్రతినిధులు వెల్లడించారు. నిషిద్ధ వస్తువులకు అమెజాన్ లో స్థానం కల్పించబోమని స్పష్టం చేశారు.
Amazon
Sweetner
Ganja
Gwalior
Visakhapatnam

More Telugu News