ఓ ఇంటివాడైన హీరో కార్తికేయ... పెళ్లికి హాజరైన చిరంజీవి

21-11-2021 Sun 14:44
  • ఓ ఇంటివాడైన ఆర్ఎక్స్ 100 హీరో
  • హైదరాబాదులో కార్తికేయ, లోహితారెడ్డిల పెళ్లి
  • వధూవరులను ఆశీర్వదించిన మెగాస్టార్
  • చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్న కార్తికేయ, లోహితారెడ్డి
Chiranjeevi attends hero Kartikeya wedding
ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలన విజయం అందుకున్న యువ హీరో కార్తికేయ వివాహం నేడు ఘనంగా జరిగింది. తన కాలేజ్ మేట్ లోహితా రెడ్డితో కార్తికేయ పరిణయం హైదరాబాదులోని ఓ మ్యారేజి హాల్ లో జరిగింది. కార్తికేయ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి కూడా విచ్చేశారు. ఆయన వధూవరులు కార్తికేయ, లోహితారెడ్డిలను ఆశీర్వదించారు.

ఈ వివాహానికి ఆర్ఎక్స్ 100 సినిమా దర్శకుడు అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, నటుడు తనికెళ్ల భరణి తదితరులు హాజరయ్యారు. కార్తికేయ, లోహితారెడ్డి గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరికి వరంగల్ ఎన్ఐటీలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారినా, పెళ్లయ్యేందుకు ఇన్నేళ్లు పట్టింది. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో వీరి పెళ్లికి మార్గం సుగమం అయింది.