కైకాల సత్యనారాయణ ఆరోగ్యంపై అపోలో స్పందన.. వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందన్న వైద్యులు

21-11-2021 Sun 11:57
  • గత కొన్ని రోజులుగా అనారోగ్యం
  • నిన్న తీవ్ర అస్వస్థతతో అపోలోలో చేరిన వైనం
  • వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందన్న అపోలో
Apollo responds about Kaikala Satyanarayana health
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు కైకాల సత్యానారాయణకు అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నసత్యనారాయణ నిన్న ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు.

ఆయన ఆరోగ్యంపై తాజాగా ఈ ఉదయం స్పందించిన అపోలో యాజమాన్యం.. సత్యనారాయణకు చికిత్స కొనసాగుతున్నట్టు తెలిపింది. వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని పేర్కొంది.