టీడీపీ నేత కూన రవికుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

21-11-2021 Sun 06:34
  • పోలీసులను దుర్భాషలాడారని అభియోగాలు
  • సోదరుడి ఇంట్లో నిద్రపోతున్న రవికుమార్
  • అరెస్ట్ చేసే సమయంలో భయభ్రాంతులకు గురిచేశారని కూన సోదరుడి ఆరోపణ
TDP leader Kuna Ravi Kumar Arrested
శ్రీకాకుళం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత కూన రవికుమార్‌ను గత రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులను దుర్భాషలాడారన్న ఆరోపణలపై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళంలోని శాంతినగర్ కాలనీలో తన సోదరుడి ఇంట్లో నిద్రపోతున్న రవికుమార్‌ను అరెస్ట్ చేసి ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు తెలుస్తోంది. తన సోదరుడిని అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు తమను భయభ్రాంతులకు గురిచేశారని రవికుమార్ సోదరుడు ఆరోపించారు.