సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

20-11-2021 Sat 07:39
  • భారీ పారితోషికం తీసుకుంటున్న నయన్ 
  • అమెరికాలో బాలయ్య సినిమా షూటింగ్  
  • బ్రహ్మానందం తనయుడు హీరోగా సినిమా
Nayanatara charges a bomb for Chiranjeevis film
*  చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న 'గాడ్ ఫాదర్' సినిమాలో నయనతార కీలక పాత్ర పోషిస్తున్న సంగతి విదితమే. ఇందుకు గాను ఆమె సుమారు నాలుగు కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లి వరసయ్యే పాత్రలో నయనతార నటిస్తోంది.
*  బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ ఇటీవలే హైదరాబాదులో లాంఛనంగా మొదలైంది. కాగా, ఈ చిత్రం కథ రీత్యా ఎక్కువ భాగం షూటింగును అమెరికాలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
*  ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్ మరో సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. నూతన దర్శకుడు సుబ్బు చెరుకూరి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం షూటింగ్ నిన్న హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభమైంది.