Team India: రెండో టీ20: టీమిండియా టార్గెట్ 154 రన్స్

  • రాంచీలో టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసిన కివీస్
  • 34 పరుగులు చేసిన గ్లెన్ ఫిలిప్స్
  • సమష్టిగా సత్తా చాటిన భారత బౌలర్లు
Team India Vs New Zealand in Ranchi

న్యూజిలాండ్ తో రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులకు పరిమితమైంది.

కివీస్ జట్టులో గ్లెన్ ఫిలిప్స్ 21 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులతో 34 పరుగులు చేశాడు. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ 31, డారిల్ మిచెల్ 31 పరుగులు చేసి జట్టుకు దూకుడైన ఆరంభం ఇచ్చారు. మార్క్ చాప్ మన్ (21) కూడా ధాటిగా ఆడడంతో కివీస్ భారీ స్కోరు దిశగా పయనిస్తున్నట్టు కనిపించింది.

అయితే టీమిండియా బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి కివీస్ జోరుకు కళ్లెం వేశారు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ కు 2 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ కు 1, దీపక్ చహర్ కు 1, అక్షర్ పటేల్ కు 1, రవిచంద్రన్ అశ్విన్ కు 1 వికెట్ లభించాయి.

More Telugu News