చంద్రబాబు అర్ధాంగిని అసభ్యంగా దూషించి వైసీపీ రాష్ట్ర రాజకీయాలను నీచాతినీచ స్థాయికి దిగజార్చింది: సుజనా చౌదరి

19-11-2021 Fri 17:23
  • తన అర్ధాంగిని వైసీపీ నేతలు దూషించారన్న చంద్రబాబు
  • రాజకీయాలు అథమస్థాయికి పడిపోయాయన్న సుజనా
  • వైసీపీ తీరు సిగ్గుచేటు అంటూ విమర్శలు
  • నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నానని వెల్లడి
Sujana Chowdary said he condemns YCP verbal attack on Chandrababu wife
టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి భువనేశ్వరిని ఏపీ అసెంబ్లీలో నేడు వైసీపీ నేతలు దూషించారన్న అంశంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి స్పందించారు. రాష్ట్రంలో రాజకీయాలు ఇంత అథమస్థాయికి పడిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇన్నాళ్లు వ్యక్తిగత దూషణలు జుగుప్స కలిగించాయనుకుంటే, నేడు చంద్రబాబు అర్ధాంగిని అసభ్యంగా దూషించడం ద్వారా వైసీపీ రాష్ట్ర రాజకీయాలను నీచాతినీచ స్థాయికి దిగజార్చిందని విమర్శించారు. ఇది సిగ్గుచేటు అని, దీన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నానని తెలిపారు.