24 గంటల్లోనే దూకుడు చూపించిన 'శ్యామ్ సింగ రాయ్' టీజర్

19-11-2021 Fri 10:32
  • నాని హీరోగా 'శ్యామ్ సింగ రాయ్'
  • నాలుగు భాషల్లో నిన్న విడుదలైన టీజర్ 
  • తెలుగు టీజర్ కి 6.3 మిలియన్ వ్యూస్ 
  • డిసెంబర్ 24న సినిమా రిలీజ్   
Shyam Singha Roy movie update
నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ 'శ్యామ్ సింగ రాయ్' సినిమాను రూపొందించాడు. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకి, మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించాడు. సత్యదేవ్ కథను అందించిన ఈ సినిమా, చారిత్రక నేపథ్యంతో ముడి పడి కలకత్తా నగరంలో నడుస్తుంది. ఈ సినిమా నుంచి నిన్న టీజర్ ను రిలీజ్ చేశారు.

తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లోనూ ఈ సినిమాను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయనున్నారు. అందువలన నిన్న టీజర్ ను కూడా ఈ భాషల్లో రిలీజ్ చేశారు. తమిళంలో శివ కార్తికేయన్ ..  మలయాళంలో నజ్రియా .. కన్నడలో రక్షిత్ శెట్టితో టీజర్ ను రిలీజ్ చేయించారు.

తెలుగులో వదిలిన టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. 24 గంటల్లోనే ఈ టీజర్ 6.3 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోవడం విశేషం. ఈ విషయాన్ని ఈ సినిమా టీమ్ అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను కూడా వదిలింది. ఈ సినిమాలో నాని లవ్ ట్రాక్ నడిచేది కృతి శెట్టితో అనే విషయాన్ని టీజర్ స్పష్టం చేసింది. ఇక సాయిపల్లవి .. మడోన్నా పాత్రల సంగతేమిటనేది చూడాలి.