CM Jagan: చంద్రబాబుపై కుప్పం ఎఫెక్ట్ పడిందని మావాళ్లు అంటున్నారు: సీఎం జగన్

CM Jagan comments on Chandrababu during assembly sessions
  • కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • మహిళా సాధికారత అంశంపై సీఎం జగన్ ప్రసంగం
  • బీఏసీ సమావేశానికి చంద్రబాబు హాజరుకాలేదని వెల్లడి
  • బాబు కోసం బీఏసీ భేటీ ఆలస్యం చేశామని వివరణ
  • అయినప్పటికీ రాలేదని వ్యాఖ్యలు
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మహిళా సాధికారత అంశంపై సీఎం జగన్ ప్రసంగించారు. రాష్ట్రంలో మహిళల సర్వతోముఖాభివృద్ధిని ఓ ఉద్యమంలా భావించి అనేక పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ రెండున్నరేళ్ల కాలం మహిళా సాధికారత అంశం పరంగా ఓ సువర్ణ అధ్యాయం అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విపక్షనేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు.

చంద్రబాబు బీఏసీ సమావేశానికి హాజరుకాలేదని జగన్ తెలిపారు. చంద్రబాబు వస్తారేమోనని బీఏసీ సమావేశాన్ని కొంచెం సేపు ఆలస్యం చేశామని, అయినప్పటికీ ఆయన రాలేదని తెలిపారు. ఆయనకు ఏ కష్టం వచ్చిందో తనకైతే తెలియదని అన్నారు. అయితే 'చంద్రబాబుపై కుప్పం ఎఫెక్ట్ పడిందని మావాళ్లు అంటున్నారు' అని ఎద్దేవా చేశారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలవడం తెలిసిందే.
CM Jagan
Chandrababu
BAC
AP Assembly Session
Kuppam
Local Body Polls
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News