అద్దె గర్భం ద్వారా బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా దంపతులకు కవలలు.. పేర్లేంటంటే...!

18-11-2021 Thu 13:48
  • కవల పిల్లలు కలిగినట్టు వెల్లడించిన ప్రీతి జింటా
  • జై జింటా గుడ్ ఎనఫ్, జియా జింటా గుడ్ ఎనఫ్ అంటూ నామకరణం
  • అందరికీ రుణపడి ఉంటామంటూ కామెంట్
Preity Zinta Had Twins Through Surrogacy
బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా, జీన్ గుడ్ ఎనఫ్ దంపతులకు అద్దె గర్భం ద్వారా సంతాన ప్రాప్తి కలిగింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించారు. ‘‘ఇవాళ మీ అందరితో ఓ ఆనందకరమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. మా ప్రపంచంలోకి కవల పిల్లలు వచ్చారని చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నా. ఈ మంచి తరుణంలో మా హృదయాలు ఉప్పొంగిపోతున్నాయి. మా కుటుంబంలోకి జై జింటా గుడ్ ఎనఫ్, జియా జింటా గుడ్ ఎనఫ్ లకు స్వాగతం’’ అంటూ ఆమె ట్వీట్ చేసింది.

తమ జీవితంలోని ఈ కొత్త దశ ఎంతో ఆనందాన్ని నింపిందని పేర్కొంది. డాక్టర్లు, నర్సులు, తమకు గర్భం అద్దెకు ఇచ్చిన వారికి ఎంతో రుణపడి ఉంటామని చెప్పింది. జీన్ గుడ్ ఎనఫ్ ను వివాహం చేసుకున్న తర్వాత ప్రీతి జింటా వెండితెరకు పూర్తిగా దూరమైంది.