Cricket: సిరాజ్ తలపై ఒక్కటిచ్చిన రోహిత్.. ఇదిగో వీడియో

Rohit Slapped Siraj On His Head Funny Video Became Viral
  • నిన్న న్యూజిలాండ్ తో మ్యాచ్ సమయంలో ఘటన   
  • వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో
  • ఎందుకు కొట్టాడంటారంటూ నెటిజన్ల కామెంట్లు
టీమిండియా టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ కేఎల్ రాహుల్, పేసర్ మహ్మద్ సిరాజ్ ల మధ్య జరిగిన ఓ ఫన్నీ సన్నివేశం వైరల్ అవుతోంది. నిన్న న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో.. రోహిత్ ఔటైన తర్వాత డగౌట్ లో కూర్చుని మ్యాచ్ చూస్తున్నాడు. అతడి ముందు సిరాజ్, రాహుల్, ద్రావిడ్ ఉన్నారు. అంతా తమ ఎడమవైపున ఏదో చూస్తున్నారు. సడన్ గా రాహుల్ వెనక్కి తిరిగి రోహిత్ వైపు చూశాడు. అంతే.. సిరాజ్ తలపై రోహిత్ ఒక్కటిచ్చాడు. ఆ ఫన్నీ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ సిరాజ్ ను రోహిత్ ఎందుకు కొట్టాడంటారూ? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

నిన్న జరిగిన ఉత్కంఠభరిత పోరులో చివరికి టీమిండియానే గెలిచిన సంగతి తెలిసిందే. ఐదు వికెట్ల తేడాతో గెలిచి మూడు మ్యాచ్ ల సిరీస్ లో 1–0 ఆధిక్యాన్ని పొందింది. రెండో టీ20 మ్యాచ్ శుక్రవారం రాంచీలోని జేఎస్సీఏ స్టేడియంలో జరగనుంది. ఆ మ్యాచ్ లోనూ గెలిచి టీమిండియా సిరీస్ ను గెలవాలని చూస్తోంది.
Cricket
Team India
Rohit Sharma
Mohammed Siraj
KL Rahul

More Telugu News