మోహన్ బాబు ఇంట విషాదం

17-11-2021 Wed 18:52
  • మోహన్ బాబు సోదరుడు రంగస్వామి నాయుడు మృతి
  • ఆయన వయసు 63 సంవత్సరాలు
  • రేపు తిరుపతిలో అంత్యక్రియలు
Mohan Babu brother dead
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రంగస్వామి నాయుడు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. గుండెపోటుకు గురైన ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రంగస్వామినాయుడు తిరుపతిలో నివసిస్తున్నారు. మోహన్ బాబు, ఆయన కుటుంబం నిర్వహిస్తున్న దాతృత్వ కార్యక్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొంటున్నారు. ఆయన మరణంతో మోహన్ బాబు కుటుంబం, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. రేపు తిరుపతిలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.