Roja: 'ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ' చంద్రబాబును జనాలు తిప్పికొట్టారు: రోజా

Roja comments on Chandrababu
  • కుప్పంలో వైసీపీ గెలుపుపై రోజా హర్షం 
  • ఏ ఎన్నిక వచ్చినా వార్ వన్ సైడేనని వ్యాఖ్య
  • చంద్రబాబు, లోకేశ్ అన్నీ సర్దుకుని హైదరాబాదుకు వెళ్లాలని ఎద్దేవా
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏ ఎన్నిక వచ్చినా వార్ వన్ సైడేనని చెప్పారు. జగన్ ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబును కుప్పం ప్రజలు తిప్పికొట్టారని ఎద్దేవా చేశారు.

కుప్పంలో చంద్రబాబుకు ఇప్పటి వరకు ఇల్లు లేదని... అందుకే కుప్పం ప్రజలు ఆయనను హైదరాబాద్ ఇంటికి పరిమితం చేశారని చెప్పారు. జగన్ వెంటే తామంతా ఉన్నామని ఈ ఎన్నిక ద్వారా కుప్పం ప్రజలు తెలియజేశారని అన్నారు. ఢిల్లీలో చక్రం తిప్పుతానని చెప్పుకునే చంద్రబాబు.. కుప్పంలో బొక్కబోర్లా పడ్డారని సెటైర్ వేశారు. తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ తట్టాబుట్టా సర్దుకుని హైదరాబాదుకు వెళ్లాలని అన్నారు. వైసీపీకి ఘన విజయం అందించిన కుప్పం ప్రజలకు రోజా ధన్యవాదాలు తెలిపారు.
Roja
Jagan
YSRCP
Chandrababu
Nara Lokesh
Telugudesam
Kuppam

More Telugu News