Jagan: చంద్రబాబు ఇలాకాలో వైసీపీ జయకేతనం.. పెద్దిరెడ్డిని అభినందించిన జగన్

YSRCP wins Kuppam municipality
  • కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకున్న వైసీపీ
  • 25 వార్డుల్లో 19 వార్డులను గెలుపొందిన వైనం
  • తొలి రౌండ్ లోనే తేలిపోయిన ఫలితం
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 25 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 19 వార్డుల్లో వైసీపీ విజయం సాధించింది. కేవలం 6 వార్డుల్లో టీడీపీ గెలుపొందింది. ఎన్నికలకు ముందే 14వ వార్డులో వైసీపీ ఏకగ్రీవంగా గెలుపొందింది.

ఈ నేపథ్యంలో వైసీపీ శిబిరం ఆనందంలో మునిగిపోయింది. మరోవైపు ఈ విజయంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సీఎం జగన్ అభినందించారు. కుప్పం ఎన్నికల ఫలితం తొలి రౌండ్ లోనే తేలిపోయింది. తొలి రౌండ్ లోనే 15 వార్డులకు గాను వైసీపీ 13 వార్డులను కైవసం చేసుకుంది.
Jagan
YSRCP
Kuppam
Chandrababu
Telugudesam

More Telugu News