South Central Railway: ‘స్పెషల్’కు రైల్వే స్వస్తి.. ఇక పాత నంబర్లతోనే రైళ్లు!

  • రైళ్లకు తొలగిపోనున్న ప్రత్యేక ముద్ర
  • కరోనాకు ముందునాటి నంబర్లతోనే పరుగులు
  • ఈ నెల 21 నుంచి 28 మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు
South Central Railway Remover special Tag to Rails

కరోనా నేపథ్యంలో స్పెషల్ రైళ్లను నడిపిస్తున్న దక్షిణ మధ్య రైల్వే ఇకపై ‘ప్రత్యేక’ ముద్రను తొలగించనున్నట్టు తెలిపింది. కరోనా ముందునాటికి మాదిరిగానే పాత నంబర్లతోనే రైళ్లను నడపనున్నట్టు పేర్కొంది. ఇప్పటికే రిజర్వేషన్ చేయించుకున్న వారికి మారిన రైలు నంబర్లను ఎస్సెమ్మెస్ చేసింది. దక్షిణ మధ్య రైల్వే తాజా నిర్ణయంతో 76 రైళ్లు కొవిడ్ ముందునాటి నంబర్లతో తిరిగి సేవలు ప్రారంభిస్తాయి.

ఈ మేరకు మారిన రైళ్ల నంబర్ల జాబితాను విడుదల చేసింది. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రారంభమయ్యే పలు రైళ్లు ఉన్నాయి. అలాగే, ఈ నెల 21 నుంచి 28 మధ్య హైదరాబాద్- గోరఖ్‌పూర్, నర్సాపూర్-సికింద్రాబాద్ మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

More Telugu News