Kamal Haasan: మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించనున్న కమలహాసన్!

Kamal Hassan to produce a multi starrer
  • ఆర్టిస్టుగా.. నిర్మాతగా కమల్ బిజీ 
  • పూర్తి కావచ్చిన 'విక్రమ్' సినిమా
  • ప్రముఖ దర్శకుడితో మల్టీ స్టారర్  
  • ప్రస్తుతం జరుగుతున్న స్క్రిప్టు పని    

విలక్షణ నటుడు కమల హాసన్ ఇప్పుడు స్పీడు పెంచుతున్నారు. ఓపక్క ఆర్టిస్టుగా నటిస్తూనే మరోపక్క సొంత బ్యానర్ పై సినిమాలు నిర్మించడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన శంకర్ దర్శకత్వంలో 'ఇండియన్ 2' చిత్రం చేస్తున్నారు. పలు కారణాంతరాల వల్ల ఆగిన ఆ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి తిరిగి కొనసాగనుంది.

అలాగే, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'విక్రమ్' పేరిట రూపొందుతున్న చిత్రంలో కూడా ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పై భారీ బడ్జెట్టుతో కమల్ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తికావచ్చింది.

మరోపక్క, ఇతర హీరోలతో కూడా ఆయన తన బ్యానర్ పై సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఓ భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని నిర్మించడానికి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో ప్రముఖ నటులు విక్రమ్, విజయ్ సేతుపతి హీరోలుగా నటిస్తారని తెలుస్తోంది.

ఇక ఓ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహించే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు పని ప్రస్తుతం జరుగుతోంది. అయితే, ఇందులో కమల్ ఏదైనా పాత్ర పోషిస్తారా? లేదా? అన్నది ఇంకా తెలియరాలేదు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుంది.

  • Loading...

More Telugu News