బీఎస్పీ అధినేత్రి మాయావతికి మాతృవియోగం
- మాయావతి తల్లి రామ్రాటి కన్నుమూత
- ఢిల్లీలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- హుటాహుటీన ఢిల్లీ బయల్దేరిన మాయావతి
- రేపు అంత్యక్రియలు
తల్లి మరణవార్త విని మాయావతి హుటాహుటీన లక్నో నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మాయావతి తల్లి అంత్యక్రియలు రేపు ఢిల్లీలో నిర్వహించనున్నారు. రామ్రాటి మృతి పట్ల బీఎస్పీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా, ఏడాది కిందట మాయావతి తండ్రి ప్రభుదయాళ్ (95) కన్నుమూశారు.