Jawad: బంగాళాఖాతంలో 'జవాద్' తుపాను... ఏపీ తీరంపైనే గురి!

  • నేడు అండమాన్ వద్ద సముద్రంలో అల్పపీడనం
  • బంగాళాఖాతంలోకి ప్రవేశించి బలపడే అవకాశం
  • తుపానుగా మారి పశ్చిమ వాయవ్య దిశగా పయనం
  • 'జవాద్' పేరును సూచించిన సౌదీ అరేబియా
Jawad cyclone may hit AP coast

బంగాళాఖాతంలో కొత్త తుపాను పురుడు పోసుకుంటోంది. అండమాన్ వద్ద సముద్రంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది బంగాళాఖాతంలోకి ప్రవేశించి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తుపానుగా మారితే దీనిని 'జవాద్' అని పిలవనున్నారు.

ఇది ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఏపీ తీరాన్ని తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం గణనీయంగా ఏపీ, ఒడిశాలపై ఉండొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. కాగా, 'జవాద్' అనే పేరును సౌదీ అరేబియా సూచించింది. అరబిక్ భాషలో 'జవాద్' అంటే గొప్పది అని అర్థం.

More Telugu News