Samanta: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Samantas quote in Insta viral
  • 'మంచి జరుగుతుంది' అంటున్న సమంత 
  • అనిల్ రావిపూడితో పవన్ కామెడీ సినిమా  
  • చిరంజీవి కి తమ్ముడిగా రవితేజ ఖరారేనట!  

*  విడాకులు తీసుకున్న తర్వాత కథానాయిక సమంత సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టినా ఆది వైరల్ అవుతోంది. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా 'త్వరలో ఓ మంచి జరగనుంది.. గుర్తుంచుకోండి..' అంటూ ఇన్ స్టా స్టోరీస్ లో ఓ కోట్ పెట్టింది. మరి, ఇది దేని గురించి అన్నది అందరిలోనూ కుతూహలాన్ని రేపుతోంది.
*  పవన్ కల్యాణ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ ఎంటర్ టైనర్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తారు. ప్రస్తుతం చేస్తున్న కథలకు భిన్నంగా, పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ స్క్రిప్టును తయారుచేయాల్సిందిగా దర్శకుడు అనిల్ కు పవన్ సూచించినట్టు తెలుస్తోంది.
*  చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. 'వాల్తేర్ వీరయ్య' అనే టైటిల్ని కూడా దీనికోసం పరిశీలిస్తున్నారు. ఇక ఇందులో చిరంజీవికి తమ్ముడిగా హీరో రవితేజ నటించడం దాదాపు ఖరారైందని సమాచారం.    

  • Loading...

More Telugu News