Gayatri Prajapati: తల్లీకూతుళ్లపై అత్యాచారం కేసులో యూపీ మాజీమంత్రికి జీవితఖైదు

  • 2017లో గాయత్రి ప్రజాపతిపై ఓ మహిళ ఫిర్యాదు
  • సుప్రీం ఆదేశాలతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు
  • ముగ్గురిని దోషులుగా నిర్ధారించిన లక్నో కోర్టు
  • జీవితఖైదుతో పాటు రూ.2 లక్షల చొప్పున జరిమానా
Uttar Pradesh former minister Gayatri Prajapati sentenced for life

ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి, సమాజ్ వాదీ పార్టీ నేత గాయత్రి ప్రజాపతి, ఆయన అనుచరులపై చిత్రకూట్ కు చెందిన ఓ మహిళ 2017లో సామూహిక అత్యాచారం ఆరోపణలు చేసింది. ఆ కేసులో మాజీమంత్రి గాయత్రి ప్రజాపతికి న్యాయస్థానం జీవితఖైదు విధించింది. తనపైనా, తన కుమార్తె (మైనర్)పైనా గాయత్రి ప్రజాపతి, ఆయన అనుచరులు అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆ మహిళ ఫిర్యాదు చేసింది.

ఈ కేసుపై అప్పట్లో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంది. సుప్రీం ఆదేశాలతో పోలీసులు ప్రజాపతి, ఆయన అనుచరులపై గ్యాంగ్ రేప్ సెక్షన్లు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. చివరికి ఈ కేసులో నలుగురు నిర్దోషులుగా బయటపడగా, మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతిని, ఆయన అనుచరుల్లో ఇద్దరిని లక్నో స్పెషల్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఆ ముగ్గురికి జీవితఖైదు, రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించింది.

More Telugu News