Pragathi: 'ఇదిగో నా కూతురు!' అంటూ నటి ప్రగతి ఆసక్తికర పోస్టు

Pragathi shares interesting pic
  • మెహ్రీన్ తో కలిసున్న ఫొటో పంచుకున్న ప్రగతి
  • రీల్ డాటర్ నుంచి రియల్ డాటర్ వరకు అంటూ క్యాప్షన్
  • తమ మధ్య అనుబంధం ఏర్పడిందంటూ వ్యాఖ్య  
  • సినిమాలు, సీరియళ్లలో ప్రగతి బిజీ
ప్రముఖ నటి ప్రగతి ఇటు సినిమాలు, అటు టీవీ సీరియళ్లతో ఎంతో బిజీగా ఉన్నారు. అనేక హిట్ సినిమాల్లో తల్లి పాత్రలు పోషిస్తూ, టీవీ సీరియళ్లలోనూ డైనమిక్ పాత్రల్లో నటిస్తూ కెరీర్ ను 360 డిగ్రీస్ లో ఎంజాయ్ చేస్తున్నారు. సెంటిమెంట్, కామెడీ, సీరియస్... ఇలా ఏ పాత్ర అయినా అందులో ఒదిగిపోతూ నేచురల్ ఆర్టిస్ట్ గా పేరుతెచ్చుకున్నారు. ప్రగతి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. పర్సనల్ అప్ డేట్లను కూడా అభిమానులతో పంచుకుంటూ నిత్యం వారికి దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తారు.

తాజాగా యంగ్ హీరోయిన్ మెహ్రీన్ పీర్జాతో కలిసి ఉన్న ఫొటోలను పంచుకున్నారు. ప్రగతి ఒళ్లో కూర్చున్న మెహ్రీన్ చిరునవ్వులు చిందిస్తుండడం ఆ ఫొటోల్లో చూడొచ్చు. పనిచేసే చోట స్నేహబంధం అల్లుకుంటే అంతకంటే పరమానందం ఇంకేముంటుందని పేర్కొన్నారు. సినిమా కూతురు కాస్తా నిజజీవితంలోనూ కూతురు అయింది అంటూ మెహ్రీన్ ని తన బిడ్డగా భావిస్తున్నట్టు తెలిపారు. ఎఫ్2 చిత్రంలో ప్రగతి, మెహ్రీన్ తల్లీకూతుళ్లుగా నటించిన సంగతి తెలిసిందే.

ప్రగతి... సెట్స్ మీదనే కాదు బయట కూడా ఎంతో సరదాగా ఉంటారని సహచర నటులు చెబుతుంటారు. ముఖ్యంగా, హీరోయిన్ రెజీనా, ప్రగతి మధ్య కూడా తల్లీకూతుళ్ల వంటి అనుబంధం కనిపిస్తుంది. ఈ విషయాన్ని ప్రగతి గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రెజీనా తన కూతురు వంటిదని చెప్పారు. తనను రెజీనా అమ్మ అనే పిలుస్తుందని అన్నారు. 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రం నుంచి రెజీనా అంటే తనకు వాత్సల్యం ఏర్పడిందని తెలిపారు.

ఈ సందర్భంగా యూట్యూబ్ చానల్ యాంకర్ కూడా రెజీనా గురించి ఓ ఆసక్తికర అంశం వెల్లడించింది. రెజీనాను ఓసారి ఇంటర్వ్యూ చేస్తుంటే మధ్యలో ఫోన్ కాల్లో మాట్లాడుతూ అమ్మా, అమ్మా అని మాట్లాడుతుంటే వాళ్ల అమ్మ అనుకున్నానని, కానీ ఆ తర్వాత అది మీరు (ప్రగతి) అని తెలిసిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇక ఇలియానా కూడా ప్రగతితో ఎంతో క్లోజ్ నెస్ మెయింటైన్ చేస్తుంది. జల్సా చిత్రం నుంచి ప్రగతి, ఇలియానా బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు. జల్సా చిత్రీకరణ సమయంలో హెయిర్ డ్రస్సర్ రాకపోతే ఇలియానాకు ఏంచేయాలో పాలుపోని స్థితిలో ప్రగతే ఎంతో చొరవ తీసుకుని ఆమెకు రెండు జడలు వేసిందట. ప్రగతి అమ్మపాత్రలు పోషిస్తున్నప్పటికీ ఆమెది చిన్నవయసే. దాంతో హీరోయిన్లతో ఆమె ఇట్టే కలిసిపోతుంది.
Pragathi
Mehreen
Daughter
Regina
Ileana
Tollywood

More Telugu News