Hanuma Vihari: తెలుగుతేజం విహారికి టీమిండియాలో దక్కని చోటు... బీసీసీఐపై నెటిజన్ల ఆగ్రహం

  • న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ కు టీమిండియా ఎంపిక
  • విహారికి మొండిచేయి చూపిన సెలెక్టర్లు
  • సిడ్నీ టెస్టులో విహారి పోరాటం మర్చిపోయారా అంటూ నెటిజన్ల ఫైర్
  • ఇక విహారిని కూడా తొక్కేస్తారేమోనంటూ ఆందోళన
Netizens shows sympathy on Hanuma Vihari

న్యూజిలాండ్ తో రెండు టెస్టుల సిరీస్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో తెలుగుతేజం హనుమ విహారికి స్థానం దక్కలేదు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. బీసీసీఐని లక్ష్యంగా చేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎంతో భవిష్యత్ ఉన్న విహారికి అన్యాయం చేస్తున్నారని, గతంలో కరుణ్ నాయర్ ను కూడా ఇలాగే తొక్కేశారని వ్యాఖ్యానించారు. రహానేను కెప్టెన్ గా ఎంపిక చేయకుంటే, అతడ్ని తప్పించి విహారిని తీసుకుంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు. బోర్డు తీరు చూస్తుంటే విహారికి ఇక అవకాశాలు దక్కక మరుగునపడిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో, గత ఆస్ట్రేలియా పర్యటనలో సాధించిన చారిత్రక టెస్టు సిరీస్ విజయంలో విహారి పాత్రను గుర్తు చేస్తున్నారు. ఓ టెస్టును డ్రా చేయడంలో విహారి మొండిగా పోరాడాడని, న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా స్టార్లందరూ ఇబ్బందులు ఎదుర్కొంటుంటే విహారి ఒక్కడే సత్తా చాటాడని, వెస్టిండీస్ పై ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో తన తొలి సెంచరీ సాధించాడని నెటిజన్లు వివరించారు.

More Telugu News