Shivraj Kumar: ఆ సమయంలో ఎన్టీఆర్ ఎంతో ధైర్యం చెప్పాడు: శివరాజ్ కుమార్

Shivraj Kumar opines about NTR
  • పునీత్ రాజ్ కుమార్ ఇటీవల హఠాన్మరణం
  • తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన శివరాజ్ కుమార్
  • ఎన్టీఆర్ తమకు తమ్ముడి లాంటి వాడని వెల్లడి
  • తమ కుటుంబంతో అనుబంధం ఉందని వివరణ

కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం తర్వాత ఆయన సోదరుడు శివరాజ్ కుమార్ తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. పునీత్ మరణం తమ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసిందని అన్నారు. పునీత్ భౌతికకాయానికి నివాళులు అర్పించడానికి వచ్చిన టాలీవుడ్ అగ్రహీరో ఎన్టీఆర్ తనతో పలికిన మాటలను కూడా శివరాజ్ కుమార్ ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

"అన్నా మీకు నేనున్నాను అంటూ అండగా నిలిచాడు. తీరని శోకంలో ఉన్న మాకు ఎంతో ధైర్యం చెప్పాడు. ఆ సమయంలో ఓ తమ్ముడిలా అనిపించాడు. మా కుటుంబంతో ఎన్టీఆర్ కు ఎంతో సాన్నిహిత్యం ఉంది" అని వివరించారు. కాగా, పునీత్ కు నివాళులు అర్పించే సమయంలో శివరాజ్ కుమార్... ఎన్టీఆర్ ను హత్తుకుని కన్నీటిపర్యంతం కావడం మీడియాలో కనిపించింది.

  • Loading...

More Telugu News