నేను బతికే ఉన్నా: రెజ్లర్ నిషా దహియా
- నిషా దహియా, ఆమె సోదరుడిని కాల్చి చంపేశారంటూ వార్తలు
- తాను సురక్షితంగా ఉన్నానన్న నిషా
- గోండాలో జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చానని వివరణ
గోండాలో జరుగుతున్న జాతీయ సీనియర్ పోటీల్లో పాల్గొనేందుకు తాను వచ్చానని తెలిపారు. తాను సురక్షితంగా ఉన్నానని చెప్పారు. ఆమె మాట్లాడిన వీడియోను భారత రెజ్లింగ్ సమాఖ్య విడుదల చేసింది. సెర్బియాలోని బెల్ గ్రేడ్ లో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ 65 కేజీల విభాగంలో నిషా దహియా కాంస్య పతకాన్ని సాధించారు.