Pooja Hegde: పాత్ర బాగుండాలి .. పాట బాగుండాలి: పూజ హెగ్డే

Pooja Hegde will do the special songs
  • స్టార్ హీరోయిన్ గా పూజ దూకుడు
  • వరుసగా వచ్చి పడుతున్న సక్సెస్ లు
  • ప్రత్యేక పాత్రలకు అభ్యంతరం లేదు
  • స్పెషల్ సాంగ్స్ కి సిద్ధమన్న పూజ
పూజ హెగ్డే ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అవకాశాలతో పాటు విజయాలు కూడా పలకరిస్తూ ఉండటంతో, ఇప్పుడు ఆమె క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. తెలుగుతో పాటు తమిళ .. హిందీ సినిమాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆమె ఒక ఫంక్షన్ కి వచ్చే సమయాన్ని కూడా సినిమాకే కేటాయిస్తుందని రీసెంట్ గా హరీశ్ శంకర్ జోక్ చేశాడు కూడా.

స్టార్ హీరోయిన్ గా ఇంత బిజీగా ఉన్న పూజ .. గతంలో 'రంగస్థలం' సినిమాలో 'జిగేల్ రాణి' తరహా స్పెషల్ సాంగ్స్ చేయదని అనుకుంటారేమోనని, ఆ సందేహానికి ఆమె తెరదింపేసింది. ''ఇప్పుడు కూడా స్పెషల్ సాంగ్స్ చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే పాట బాగుండాలి .. అది భారీ ప్రాజెక్టులో స్టార్ హీరో సినిమాలో ఉండాలి.

ఇక ప్రత్యేకమైన పాత్రలు చేయడానికి కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఆ పాత్రకి ఉండవలసిన ప్రాధాన్యత ఉండాలి. 'ఆచార్య' సినిమాలో నేను చేసింది ప్రత్యేకమైన పాత్రనే. నీలాంబరి అనే ఆ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంది. అందువల్లనే ఆ పాత్రను వదులుకోలేదు. అలాంటి పాత్రలను వదులుకోకూడదు కూడా" అని చెప్పుకొచ్చింది.

Pooja Hegde
Acharya
Rangasthalam

More Telugu News