Virat Kohli: కోహ్లీ కూతురుని రేప్ చేస్తానని బెదిరించిన హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్!

Hyderabad man who gave rape threats to Kohli daughter arrested
  • పాకిస్థాన్ చేతిలో ఓడిపోయిన తర్వాత కోహ్లీకి బెదిరింపులు
  • హైదరాబాద్ కు చెందిన అలిబత్తిని రాంనాగేశ్ అరెస్ట్
  • ముంబైకి తరలించిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు
టీ20 మ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ కూతురుని అరెస్ట్ చేస్తానని బెదిరించిన హైదరాబాదీ అలిబత్తిని రాంనాగేశ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. 23 ఏళ్ల నాగేశ్ ను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి అతన్ని ముంబైకి తరలించి, విచారణ జరుపుతున్నారు.

ఇటీవలి కాలంలో క్రికెటర్లపై కొందరు ఉన్మాదులు అసభ్యకరంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే, గతంలో కూడా ఇలాంటి పరిస్థితిని ధోనీ కూడా ఎదుర్కొన్నాడు. గెలుపు, ఓటములు ఆటలో భాగమైనప్పటికీ... క్రికెటర్ల కుటుంబ సభ్యులపై కొందరు విపరీత వ్యాఖ్యలు చేస్తుండటాన్ని అందరూ ఖండిస్తున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Virat Kohli
Daughter
Rape Threats
Hyderabad Man
Arrest

More Telugu News