Chiranjeevi: రేపు 'భోళా శంకర్' నుంచి చిరూ పోస్టర్!

  • సెట్స్ పై ఉన్న 'గాడ్ ఫాదర్'
  • రేపు 'భోళా శంకర్' పూజా కార్యక్రమాలు
  • కథానాయికగా తమన్నా ఖరారు 
  • చిరూ చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్  
Bhola Shankar movie update

సాధారణంగా చిరంజీవి ఒక కథను ఓకే చేయడానికీ .. ఒక ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి చాలా సమయం తీసుకుంటారు. ఒక ప్రాజెక్టు పూర్తయిన తరువాతనే మరో ప్రాజెక్టు పైకి వెళతారు. కానీ ఈ సారి అందుకు భిన్నంగా ఆయన వరుస ప్రాజెక్టులను ఒప్పుకున్నారు. నిదానంగా ఒకదాని తరువాత ఒకటిగా చేసుకుంటూ వెళతారని అంతా అనుకున్నారు.

కానీ ఇటీవలే 'గాడ్ ఫాదర్'ను సెట్స్ పైకి తీసుకెళ్లిన ఆయన, రేపు ఉదయం 7:45 నిమిషాలకు 'భోళా శంకర్' ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. మెహర్ రమేశ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో చిరూకి సంబంధించిన లుక్ టెస్ట్ రీసెంట్ గా చేశారట. ఆ లుక్ ను రేపు రిలీజ్ చేయనున్నట్టు చెబుతున్నారు.

ఈ సినిమాలో కథానాయికగా తమన్నాను ..  చిరూ చెల్లెలి పాత్ర కోసం కీర్తి సురేశ్ ను తీసుకున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని చెబుతున్నారు. ఇక మరో వైపు నుంచి బాబీ సినిమాకి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. త్వరలోనే ఆ సినిమా కూడా ముహూర్తాన్ని ఖాయం చేసుకోనుందని అంటున్నారు.

More Telugu News