Malala Yousafzai: మీ ఆశీస్సులు పంపండి.. అంటూ పెళ్లి ఫొటోలను పోస్టు చేసిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా

Malala Yousafzai and Her Partner Asser Announce Wedding
  • 17 ఏళ్ల వయసులో నోబెల్ శాంతి బహుమతి
  • బ్రిటన్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా నిఖా
  • భర్త అస్సర్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసిన మలాలా

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, పాకిస్థాన్‌కు చెందిన మలాలా యూసుఫ్‌జాయ్ తన భర్తతో కలిసి పోస్టు చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ప్రస్తుతం బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో నివసిస్తున్న మలాలా కుటుంబ సభ్యుల సమక్షంలో అస్సర్‌ను పెళ్లి చేసుకున్నారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న మలాలా.. ఈ రోజు తన జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజని అన్నారు. అస్సర్, తాను జీవిత భాగస్వాములమయ్యామని, తమ నిఖా నిరాడంబరంగా జరిగిందని పేర్కొన్నారు. భార్యాభర్తలుగా కొత్త ప్రయాణం సాగించడానికి సంతోషంగా ఉన్న తమకు ఆశీస్సులు పంపాలని కోరారు.

పాకిస్థాన్‌లో బాలికా విద్య కోసం పాటుపడుతూ ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తిన మలాలాను అంతమొందించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. 2012లో ఆమె ఉన్న పాఠశాల బస్సులోకి చొరబడిన తాలిబన్లు కాల్పులు జరిపారు. అయితే, స్వల్ప గాయంతో ఆమె బయటపడ్డారు.

బ్రిటన్‌లో చికిత్స అనంతరం ఆమె అక్కడే స్థిరపడ్డారు. ఉగ్ర ఘటన తర్వాత కూడా బాలికా విద్య కోసం పోరాడుతూనే ఉన్న ఆమెకు 2014లో 17 ఏళ్ల వయసులో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఫలితంగా ఆ బహుమతి అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా మలాలా రికార్డు నెలకొల్పారు.

  • Loading...

More Telugu News