Sri Vishnu: 'అర్జున ఫల్గుణ' టీజర్ అదిరిందిగా: రానా

Arjuna Falguna movie update
  • శ్రీవిష్ణు నుంచి 'అర్జున్ ఫల్గుణ'
  • యాక్షన్ డ్రామా జోనర్లో సాగే కథ
  • కథానాయికగా అమృత అయ్యర్
  • సినిమాపై ఆసక్తిని పెంచుతున్న టీజర్  
మొదటి నుంచి కూడా శ్రీవిష్ణు వైవిధ్యభరితమైన కథలకు .. పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు. 'రాజ రాజ చోర'తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న శ్రీవిష్ణు, తన తాజా చిత్రంగా 'అర్జున ఫల్గుణ'ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్నాడు. నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాతో తేజ మర్ని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

అమృత అయ్యర్ కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 'నాది కాని కురుక్షేత్రంలో నాకు తెలియని పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాను. అయినా బలైపోవడానికి నేను అభిమన్యుడిని కాదు .. అర్జునుడిని" అనే శ్రీవిష్ణు డైలాగ్ తో ఈ టీజర్ మొదలైంది. ఈ సినిమాపై ఆసక్తి పెరగడానికి ఈ ఒక్క డైలాగ్ సరిపోతుందేమో.

యాక్షన్ సీన్స్ పై కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. మాస్ పాత్రలో శ్రీవిష్ణు కనిపిస్తున్నాడు. కథ గ్రామీణ ప్రాంతంలోను .. అడవి నేపథ్యంలోను సాగనున్నట్టు అర్థమవుతోంది. ఈ  టీజర్ చూసి 'అద్దిరిపోయిందిగా .. న్యూ వెరైటీకి సెల్యూట్' అంటూ రానా ట్వీట్ చేయడం విశేషం.
Sri Vishnu
Amrutha Ayyar
Teja Marni

More Telugu News