CM Jagan: భువనేశ్వర్ లో సీఎం జగన్ ను కలిసిన ఒడిశా తెలుగు సంఘం ప్రతినిధులు

Odisha Telugu Association members met CM Jagan in Bhuvaneshwar
  • ఒడిశా పర్యటనకు వెళ్లిన సీఎం జగన్
  • సీఎం జగన్ కు జ్ఞాపికను బహూకరించిన తెలుగు సంఘం
  • ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో సమావేశం కానున్న జగన్
  • నీటి అంశాలపై చర్చ
ఉభయ రాష్ట్రాలకు చెందిన పలు అంశాలపై చర్చించేందుకు ఏపీ సీఎం జగన్ ఒడిశా పర్యటనకు వెళ్లారు. భువనేశ్వర్ లో ఆయనను ఒడిశా తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. సీఎంకు జ్ఞాపికను అందించారు. కాగా, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో సీఎం జగన్ సమావేశానికి సర్వం సిద్ధమైంది. వంశధార నదిపై నేరడి వద్ద ఆనకట్ట నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు అంశాలపై నెలకొన్న వివాదాలే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరగనుంది. ఒడిశాతో దశాబ్దాలుగా కొనసాగుతున్న జలవివాదాల పరిష్కారానికి ఈ సమావేశం నాంది పలుకుతుందని భావిస్తున్నారు.
CM Jagan
Telugu Association
Bhuvaneshwar
Odisha

More Telugu News