poonam kaur: విడాకులపై సినీ నటి పూనమ్‌ కౌర్ చేసిన ట్వీట్ వైర‌ల్.. కాసేప‌టికే డిలీట్

  • విడాకుల త‌ర్వాత పురుషుల‌కు బాధ ఉండదా?
  • మ‌హిళలనే స‌మాజంలో ఇబ్బందులు పెడతారు
  • వారిని మాటలతో బాధిస్తారు అంటూ ట్వీట్
poonam kaur tweet goes viral

సినీ నటి పూనమ్‌ కౌర్ విడాకుల గురించి ఓ ట్వీట్ చేసి, ఆ వెంటనే డిలీట్ చేసింది. అయితే, నెటిజన్లు అప్ప‌టికే దానిని స్క్రీన్ షాట్ తీసిపెట్టుకున్నారు. ఆమె ప‌లు అంశాల‌పై సామాజిక మాధ్య‌మాల్లో స్పందిస్తుంటుంది. తాజాగా విడాకుల‌పై స్పందించి ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం. విడాకుల త‌ర్వాత పురుషుల‌కు బాధ ఉండదా? అని ఆమె ప్ర‌శ్నించింది.

విడాకులు తీసుకున్న మ‌హిళలనే స‌మాజంలో ఇబ్బందులు పెడతారని, వారిని మాటలతో బాధిస్తారని రాసుకొచ్చింది. మ‌హిళ‌ల‌ వల్లే పురుషుల‌కు ఇబ్బందిక‌ర పరిస్థితులు వస్తుంటాయని సమాజం అంటుంద‌ని చెప్పింది. ఇప్పటికి కూడా మనం విడాకుల అంశాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలిగామా? అని ప్ర‌శ్నించింది.

విడాకుల విష‌యంలో మనకు కచ్చితమైన దృక్కోణం ఉందా? అని ఆమె నిల‌దీసింది. ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేసిందోనని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇటీవ‌ల విడాకులు తీసుకున్న సినీన‌టుల‌ను గుర్తు చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. పూనమ్‌ కౌర్ ఈ ట్వీట్ ను డిలీట్ చేసిన త‌ర్వాత కూడా దీనిపై చ‌ర్చ ఆగ‌డం లేదు.

                 

More Telugu News