Ravi Shastri: మళ్లీ కోచ్ గానే కొనసాగనున్న రవిశాస్త్రి.. సంప్రదింపులు జరుపుతున్న ఐపీఎల్ నయా ఫ్రాంచైజీ

Ravi Shastri to join new IPL franchise Ahmedabad as head coach
  • రవితో అహ్మదాబాద్ ఫ్రాంచైజీ సంప్రదింపులు
  • రవితోపాటే ఫీల్డింగ్, బ్యాటింగ్ కోచ్‌లు కూడా
  • త్వరలోనే ఒప్పందంపై సంతకం!
టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి అండ్ కో పదవీ కాలం నేటి భారత్-నమీబియా మ్యాచ్‌తో ముగిసిపోనుంది. ఆ తర్వాత రవి ఏం చేయబోతున్నారనే ఊహాగానాలకు సమాధానం దొరికేసింది. ఇప్పటి వరకు కోహ్లీసేనను నడిపించిన రవిశాస్త్రి ఇకపై ఐపీఎల్‌ జట్టును నడిపించనున్నట్టు తెలుస్తోంది.

ఈ మేరకు ఇటీవల పురుడుపోసుకున్న కొత్త ఫ్రాంచైజీ అహ్మదాబాద్ యాజమాన్యం రవిశాస్త్రిని సంప్రదించినట్టు తెలుస్తోంది. రవిశాస్త్రిని మాత్రమే కాకుండా అతడి సహచరులైన బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లు భరత్ అరుణ్, ఆర్.శ్రీధర్‌లను కూడా తీసుకోవాలని అహ్మదాబాద్ యాజమాన్యం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తయినట్టు సమాచారం. త్వరలోనే ఈ డీల్‌పై రవి సంతకం చేస్తాడని కూడా చెబుతున్నారు.

కాగా, క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత రవిశాస్త్రి దశాబ్దానికిపైగా కామెంటేటర్‌గా పనిచేశాడు. సక్సెస్‌ఫుల్ కామెంటేటర్‌గా పేరుగాంచాడు. ఆ తర్వాత టీమిండియాకు రెండుసార్లు మొత్తంగా 15 ఏళ్లు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. ఇప్పుడు మరోమారు ఐపీఎల్ జట్టుకు కోచ్‌గా వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు.
Ravi Shastri
Team India
Ahmedabad
Head Coach

More Telugu News