రేపు నాగార్జున చేతుల మీదుగా 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' ట్రైలర్ రిలీజ్

07-11-2021 Sun 20:35
  • సంతోష్ శోభన్, సిమ్రన్ శర్మ జంటగా 'ఓసీఎఫ్ఎస్'
  • ఇటీవల టీజర్ రిలీజ్ చేసిన నాని
  • టీజర్ కు విశేష స్పందన
  • రేపు సాయంత్రం 4.30 గంటలకు ట్రైలర్ రిలీజ్
Nagarjuna to be launch Oka Chinna Family Story trailer
ఈ నెల 19 నుంచి జీ5 ఓటీటీ యాప్ లో 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' (ఓసీఎఫ్ఎస్) వెబ్ సిరీస్ ప్రసారం కానుంది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను రేపు సాయంత్రం 4.30 గంటలకు అగ్రహీరో నాగార్జున విడుదల చేయనున్నారు. ఈ మేరకు వెబ్ సిరీస్ యూనిట్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' వెబ్ సిరీస్ లో 5 ఎపిసోడ్లు ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ కు మెగా డాటర్ కొణిదెల నిహారిక నిర్మాత. సంతోష్ శోభన్, సిమ్రన్ శర్మ హీరోహీరోయిన్లు. సీనియర్ నటులు నరేశ్, తులసి ముఖ్య పాత్రలు పోషించారు. మహేశ్ ఉప్పల దర్శకత్వం వహించారు.

ఇటీవలే నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా విడుదల చేసిన టీజర్ కు విశేష స్పందన లభించింది. 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' వెబ్ సిరీస్ కచ్చితంగా ప్రజాదరణ పొందుతుందని యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.