Brazil: బ్రెజిల్‌లో వింత.. ‘నిజమైన మానవతోక’తో జన్మించిన బాలుడు

  • 12 సెంటీమీటర్ల పొడవున్న తోక చివర బంతిలాంటి ఆకారం
  • గర్భిణిగా ఉన్నప్పుడు చేసిన పరీక్షల్లో కనిపించని తోక
  • నాడీ వ్యవస్థతో అనుసంధానం లేదన్న వైద్యులు
  • ఆపరేషన్ చేసి తొలగింపు
Baby Born In Brazil With 12cm Long Appendage

బ్రెజిల్‌లో జన్మించిన ఓ వింత శిశువు వైద్యులనే ఆశ్చర్యపరిచింది. కారణం.. ఆ శిశువు తోకతో జన్మించడమే. ఫోర్టలెజా పట్టణానికి చెందిన నిండు గర్భిణి ఒకరు ఆల్బెర్ట్ సాబిన్ అనే పిల్లల ఆసుపత్రిలో చేరింది. సాధారణ కాన్పునకు అవకాశం లేకపోవడంతో శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీసిన వైద్యులు బాలుడికి తోక ఉండడం చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. 12 సెంటీమీటర్ల పొడవున్న ఆ తోక చివర్లో 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో బంతిలాంటి ఆకారం కూడా ఉండడం వైద్యులను ఆశ్చర్యపరిచింది.

మహిళ గర్భం దాల్చిన తర్వాత అదే ఆసుపత్రిలో తరచూ పరీక్షలు చేయించుకున్నప్పటికీ ఎప్పుడూ ఆ తోకను గుర్తించలేదని వైద్యులు తెలిపారు. దీనిని ‘నిజమైన మానవతోక’గా అభివర్ణిస్తున్న వైద్యులు.. ఆ తోకకు నాడీ వ్యవస్థకు ఎలాంటి అనుసంధానం లేదని, చర్మానికి మాత్రమే పెరిగిందని పేర్కొన్నారు. ఆపరేషన్ చేసి ఆ తోకను తొలగించినట్టు చెప్పారు.

More Telugu News