Brahmanandam: టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందానికి రామినేని ఫౌండేషన్ పురస్కారం

Tollywood comedian Brahmanandam will be awarded with Dr Ramineni Foundation award
  • రామినేని ఫౌండేషన్ పురస్కారాల ప్రకటన
  • త్వరలోనే అవార్డుల ప్రదానోత్సవం
  • 2020 అవార్డులు కూడా అదే వేదికపై అందించనున్న ఫౌండేషన్
  • భారత్ బయోటెక్ యాజమాన్యానికి కూడా పురస్కారం
టాలీవుడ్ హాస్య నట దిగ్గజం బ్రహ్మానందం కీర్తికిరీటంలో మరో పురస్కారం చేరింది. బ్రహ్మానందం ఈ ఏడాది డాక్టర్ రామినేని ఫౌండేషన్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు రామినేని ఫౌండేషన్ కన్వీనర్ పాతూరి నాగభూషణం వెల్లడించారు. త్వరలోనే అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని, ఇదే వేదికపై 2020 సంవత్సరం అవార్డులను కూడా ప్రదానం చేస్తామని తెలిపారు.

కాగా, 2021 సంవత్సరానికి రామినేని పురస్కారానికి ఎంపికైన వారిలో సినీ జర్నలిస్టు ఎస్వీ రామారావు, భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, ఆ సంస్థ జేఎండీ సుచిత్ర ఎల్లా, నిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ దుర్గా పద్మజ కూడా ఉన్నారు.
Brahmanandam
Ramineni Award
Tollywood
Andhra Pradesh

More Telugu News