Priyanka Gandhi: మా అన్నయ్య రాహుల్ షూటింగ్ పోటీల్లో ఎన్నో పతకాలు సాధించినప్పటి ఫొటో ఇది: ప్రియాంక గాంధీ

Priyanka shares rare photo of Rahul Gandhi
  • భాయ్ దూజ్ సందర్భంగా స్పందించిన ప్రియాంక
  • రాహుల్ తో కలిసి ఉన్న ఫొటోతో ట్వీట్
  • సోదరుడి పట్ల గర్విస్తున్నానని వెల్లడి
  • ఆకట్టుకుంటున్న ఫొటో
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్విట్టర్ లో ఆసక్తికరమైన ఫొటో పంచుకున్నారు. కార్తీక మాసంలో ఉత్తరాది హిందువులు జరుపుకునే 'భాయ్ దూజ్' వేడుకను పురస్కరించుకుని ప్రియాంక సోషల్ మీడియాలో స్పందించారు. తమ సోదరులకు మహిళలు 'భాయ్ దూజ్' సందర్భంగా కానుకలు ఇస్తారు.

ఇక ఆ ఫొటోలో ప్రియాంక తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ఉన్నారు. ఆ ఫొటో చాన్నాళ్ల నాటిదని చూడగానే తెలిసిపోతోంది. దీనిపై ప్రియాంక వివరణ ఇచ్చారు.

"నా సోదరుడు నీతి కోసం తెగువతో పోరాడుతుండడం నాకు గర్వంగా ఉంది. అదే సమయంలో నా సోదరుడు ప్రేమ, దయను మర్చిపోకపోవడం పట్ల సంతోషిస్తున్నాను. ప్రతి ఒక్కరికీ భాయ్ దూజ్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇక నేను పంచుకున్న ఫొటో విషయానికొస్తే... మా అన్నయ్య షూటింగ్ పోటీల్లో ఎన్నో పతకాలు గెలిచినప్పటి ఫొటో ఇది" అని వెల్లడించారు. ఈ ఫొటోలో రాహుల్, ప్రియాంక ఇద్దరూ డెనిమ్ దుస్తుల్లో అప్పటి ట్రెండ్ కు అనుగుణంగా కనిపించారు.
Priyanka Gandhi
Rahul Gandhi
Bhai Dooj

More Telugu News