Team India: టీమిండియా డ్రెస్సింగ్ రూంలో స్కాట్లాండ్ ఆటగాళ్ల సందడి.. ఇదిగో వీడియో

  • మ్యాచ్ అనంతరం వెళ్లిన స్కాట్లాండ్ టీం
  • వస్తామనడంతో కాదనలేకపోయిన జట్టు
  • సొంతింట్లో ఉన్నట్టు ఫీలైన స్కాట్లాండ్ ప్లేయర్లు
  • ధోనీ, కోహ్లీ, రోహిత్, అశ్విన్ వంటి వాళ్ల సలహాలు
Scotland Players In Tema India Dressing Room

టీమిండియా డ్రెస్సింగ్ రూంకు అనుకోని అతిథులు వచ్చారు. స్కాట్లాండ్ ఆటగాళ్లు మనోళ్ల డ్రెస్సింగ్ రూంలో సందడి చేశారు. అందరితో సరదగా మాట్లాడారు. ఆట టెక్నిక్ లను స్టార్ ప్లేయర్ల ద్వారా తెలుసుకున్నారు. మెంటార్ ధోనీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ల నుంచి బ్యాటింగ్, బౌలింగ్ పాఠాలను నేర్చుకున్నారు.

మరెన్నో విషయాలను టీమిండియా ప్లేయర్ల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ఇటు బీసీసీఐ, అటు స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించాయి. ‘‘క్రికెట్ స్ఫూర్తికి అద్దం పట్టే సంఘటన ఇది. స్కాట్లాండ్ ఆటగాళ్లు టీమిండియా డ్రెస్సింగ్ రూంకు వస్తామంటూ వారి కోరికను చెప్పారు. మనోళ్లు వారి కోరికను మన్నించారు. సొంతింట్లో ఉన్నట్టుగా వారికి ఆతిథ్యం ఇచ్చారు’’ అని పేర్కొంటూ బీసీసీఐ ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది.


ఇటు క్రికెట్ స్కాట్లాండ్ కూడా స్టార్ ప్లేయర్లతో తమ జట్టు ఆటగాళ్లు మాట్లాడుతున్న ఫొటోలను ట్వీట్ చేసింది. వారి విలువైన సమయాన్ని కేటాయించినందుకు కోహ్లీ అండ్ టీమ్ కు ధన్యవాదాలంటూ పేర్కొంది. ఏప్రిల్ లో అబర్దీన్ లో ఆడేందుకు ఎలా సిద్ధమవుతున్నారంటూ ఓ ఆసక్తికరమైన ప్రశ్నను సంధించింది. అయితే, అది విరాట్ కోహ్లీ అన్నాడా? లేకపోతే మరేదైనా ఆంతర్యం ఉందా? అనేది మాత్రం క్లారిటీ లేదు.

More Telugu News