Jr NTR: ఒకే ఫ్రేమ్ లో ఎన్టీఆర్, చరణ్ ఊర ‘నాటు’ డ్యాన్స్.. ఇదిగో ఆర్ఆర్ఆర్ అదిరిపోయే అప్ డేట్!

NTR and Charan To Shake Their Legs In The Same Frame Latest Update From
  • ఈ నెల 10న సినిమా నుంచి రెండో పాట
  • ఇద్దరూ కలిసి డ్యాన్స్ పోజిచ్చిన పోస్టర్ విడుదల
  • ఐదు భాషల్లో పాట విడుదల
  • తెలుగులో ‘నాటునాటు’ అని సాగే గీతం
ఎన్టీఆర్, రామ్ చరణ్.. వాళ్లు స్టెప్పేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేంటి! అలాంటిది ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో ఊరమాస్ సాంగ్ కు ఆడితే ఎలా ఉండాలి? ప్రతి అభిమానీ పూనకమొచ్చి ఊగిపోరూ! అలాంటి ఒక ‘నాటు’ అప్ డేట్ నే ఇచ్చింది ‘ఆర్ఆర్ఆర్’ టీమ్. సినిమా రెండో సింగిల్ విడుదల తేదీని అనౌన్స్ చేసింది. ఈ నెల 10న పాటను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.

‘‘దద్దరిల్లిపోవాలి.. నవంబర్ 10న హై ఓల్టేజ్ డ్యాన్స్ నంబర్ వచ్చేస్తోంది’’ అంటూ ట్వీట్ చేసింది. ఐదు భాషల్లో పాటను విడుదల చేస్తున్నట్టు తెలిపింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాటను విడుదల చేస్తున్నామని వెల్లడించింది. తెలుగులో ‘నాటు నాటు’ అంటూ ఆ పాట సాగనుంది. అప్ డేట్ తో పాటు ఎన్టీఆర్, చరణ్ ఒకే ఫ్రేమ్ లో డ్యాన్స్ పోజిచ్చిన పోస్టర్ నూ పోస్ట్ చేసింది.

రాజమౌళి దర్శకత్వంలో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి స్వరాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు. హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్, బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ లు హీరోయిన్లు. అజయ్ దేవ్ గణ్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 7న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Jr NTR
Tollywood
Ramcharan
Rajamouli
Keeravani
RRR

More Telugu News