Samantha: జరిగిన నష్టానికి ఆనందం అంత త్వరగా రాదని తెలుసు.. మరోసారి ఎమోషనల్ అయిన సమంత

Samantha Emotional Post On Deepavali
  • దీపావళి నాడు ఇన్ స్టా స్టేటస్
  • క్లోజ్ ఫ్రెండ్ ఫ్యామిలీతో పండుగ
  • వారితో కలిసి దిగిన ఫొటోలు పోస్ట్
నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత కొన్నాళ్లపాటు ఎంతో ఎమోషనల్ అయింది. దాన్నుంచి బయటపడలేకపోయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ మామూలు జీవితంలోకి ఎంటరవుతోంది. వరుస సినిమాలను ప్రకటిస్తూ.. తన క్లోజ్ ఫ్రెండ్ ఫ్యామిలీతో గడుపుతూ గతాన్ని మరచిపోయే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ఎన్నెన్నో భావోద్వేగభరితమైన పోస్టులు పెట్టింది.

తాజాగా మరోసారి సమంత భావోద్వేగానికి లోనైంది. ఇన్ స్టా స్టేటస్ లో ఓ పోస్ట్ ను పెట్టింది. దీపావళి పర్వదినాన్ని ఆమె తన స్నేహితురాలైన శిల్పారెడ్డి ఫ్యామిలీతో కలిసి చేసుకుంది. ఆ ఫొటోలనూ పోస్ట్ చేసింది. ‘‘ఈ ఏడాది దీపాలు పెట్టని ఇళ్లు.. తీపి రుచి ఎరుగని కుటుంబాలు.. ఏడాది మొదట్లోనే పోగొట్టుకున్న సంతోషాలు.. ఇవన్నీ ఇప్పుడు ప్రతి సందర్భాన్ని చిన్నగానే చూపిస్తున్నాయి. పోగొట్టుకున్న ఆ ఆనందం అంత త్వరగా రాదని తెలుసు.. కానీ, వీలైనంత త్వరగా ఆ ఆనందాన్ని పొందుతారని ఆశిస్తున్నాను’’ అంటూ పోస్ట్ పెట్టింది.
అంతకన్నా ముందు.. ‘‘ఆనందానికి మించిన ధనం లేదు.. మన:శాంతికి మించిన విజయం లేదు.. ఆరోగ్యానికి మించిన మహాభాగ్యం లేదు.. దయాగుణానికి మించిన సంతృప్తి ఉండదు’’ అంటూ స్టేటస్ పెట్టింది.
Samantha
Tollywood
Deepavali

More Telugu News