బాయ్ ఫ్రెండ్‌తో ఆమిర్ ఖాన్ కూతురు దిగిన‌ ఫొటోలు వైర‌ల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాయ్ ఫ్రెండ్‌తో ఆమిర్ ఖాన్ కూతురు దిగిన‌ ఫొటోలు వైర‌ల్!

ira pic goes viral
  • త‌న ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపూర్‌ షీఖరేతో ప్రేమలో ఇరా ఖాన్
  • అత‌డితో క‌లిసి దీపావ‌ళి పండుగ‌
  • సాంప్ర‌దాయబ‌ద్ధంగా చీర క‌ట్టులో క‌న‌ప‌డ్డ ఇరా
బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ త‌న ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపూర్‌ షీఖరేతో ప్రేమలో ఉన్న విష‌యం తెలిసిందే. దీపావ‌ళి పండుగ‌ను ఆమె అత‌డితో క‌లిసి జ‌రుపుకుంది. ఈ సంద‌ర్భంగా తీసుకున్న ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

ఇందులో ఇరా ఖాన్  సాంప్ర‌దాయబ‌ద్ధంగా సిల్క్ చీర క‌ట్టి క‌న‌ప‌డుతోంది. నుపూర్ త‌ల్లి ప్రీత‌మ్ శిఖ‌రే కూడా ఈ వేడుక‌ల్లో పాల్గొంది. ఈ ఫొటోలో ఆమె కూడా క‌ప‌డుతోంది. ఇరాతో దిగిన ఫోటోల‌ను న‌పూర్ సామాజిక మాధ్య‌మాల్లో పోస్టు చేశాడు.

ఇరాతో పాటు న‌పూర్, అత‌డి త‌ల్లి కూడా  సాంప్ర‌దాయ దుస్తుల్లోనే క‌న‌ప‌డుతున్నారు. కొన్ని నెలలుగా నుపూర్, ఇరా ఖాన్ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారు.  నుపూర్‌తో రిలేష‌న్‌షిప్‌లో ఉన్న‌ట్లు కొన్ని నెల‌ల క్రితం ఇరా ఖాన్ త‌న ఇన్‌స్టా ద్వారా కూడా వెల్ల‌డించింది.

ఆమిర్ మొద‌టి భార్య రీనా ద‌త్త కూతురు ఇరా ఖాన్‌. కాగా, గత కొన్నేళ్లుగా ఆమిర్ ఖాన్‌కు నుపూర్ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా ఉన్నాడు. అనంత‌రం ఐరాకు కూడా ఆయన కోచ్‌గా మారాడు. ఈ సమయంలోనే వారిద్దరు ప్రేమలో పడ్డారు. గ‌తంలోనూ పండుగ స‌మ‌యంలో ఐరా, త‌న త‌ల్లితో నుపూర్‌ షీఖరే ఫొటోలు దిగి పోస్ట్ చేశాడు.

   

     
ira khan
Aamir Khan
Bollywood
Viral Pics

More Telugu News