Telangana: మంత్రి తలసాని కుమారుడు సాయి యాదవ్ కారు ఢీకొని వ్యక్తికి గాయాలు.. అడ్డుకున్న స్థానికులు

TS Minister Talasani Son Sai Yadav Car Rammed one person injured
  • సదర్ ఉత్సవాలకు హాజరైన సాయి యాదవ్
  • తిరిగి వెళ్తున్న సమయంలో వ్యక్తిపై నుంచి దూసుకెళ్లిన కారు
  • కాలుకు తీవ్ర గాయం
  • బాధితుడిని తమ కారులో ఆసుపత్రికి తరలించిన పోలీసులు

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడు సాయి యాదవ్ కారు ఢీకొని ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఖైరతాబాద్‌లో గత రాత్రి నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో సాయి పాల్గొన్నారు. తిరిగి వెళ్తున్న సమయంలో ఆయన కారు ఓ వ్యక్తిపై నుంచి దూసుకెళ్లింది. దీంతో అతడి కాలుకు తీవ్ర గాయమైంది.

గమనించిన అతడి కుటుంబ సభ్యులు, స్థానికులు కారును అడ్డుకుని సాయితో వాగ్వివాదానికి దిగారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. జోక్యం చేసుకున్న పోలీసులు బాధిత వ్యక్తి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి అతడిని వారి వాహనంలోనే సమీపంలోని ఆసుపత్రికి తరలించడంతో గొడవ సద్దుమణిగింది.

  • Loading...

More Telugu News