Chandrababu: కుప్పంలో ఉద్రిక్తత... రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు చంద్రబాబు లేఖ

TDP Chief Chandrababu wrote SEC on Kuppam incident
  • కుప్పంలో నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత
  • టీడీపీ అభ్యర్థి వెంకటేశ్ పై దాడి
  • వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలన్న చంద్రబాబు
  • తమ అభ్యర్థిని తీవ్రంగా కొట్టారని వెల్లడి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీకి లేఖ రాశారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ లేఖలో పేర్కొన్నారు. 14వ వార్డు టీడీపీ అభ్యర్థి వెంకటేశ్ పై వైసీపీ నేతలు దాడి చేశారని, నామినేషన్ పత్రాలు చించివేశారని ఆరోపించారు. నామినేషన్లు దాఖలు చేసే కేంద్రం వద్దే దాడి జరిగిందని వెల్లడించారు.

ఈ దాడిలో 30 మంది వరకు పాల్గొని వెంకటేశ్ ను తీవ్రంగా కొట్టారని వివరించారు. అతడి సెల్ ఫోన్ లాగేసుకున్నారని తెలిపారు. దాడికి పాల్పడిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు అభ్యర్థులకు భద్రత కల్పించాలని కోరారు. స్వేచ్ఛగా నామినేషన్ వేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో, దాడికి సంబంధించిన ఫొటోలను కూడా చంద్రబాబు తన లేఖకు జతచేవారు.
Chandrababu
Letter
SEC
Kuppam
Municipal Elections

More Telugu News