మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన డ్రెస్ లో జిగేల్మన్న అల్లు అర్జున్

04-11-2021 Thu 19:46
  • మెగా కుటుంబ సభ్యుల దీపావళి వేడుకలు
  • డిజైనర్ డ్రెస్సులో బన్నీ
  • కస్టమ్ మేడ్ డ్రెస్సుపై ఏఏ అనే ఆంగ్ల అక్షరాలు
  • వైరల్ అవుతున్న ఫొటోలు
Allu Arjun looks dazzling in Manish Malhotra designed custom made classic suit
దీపావళి సందర్భంగా మెగా వారసులు, కుటుంబసభ్యులందరూ ఒక్కచోట కలిశారు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా రూపొందించిన దుస్తుల్లో ఆకర్షణీయంగా కనిపించారు. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా బన్నీ కోసమే ఈ డ్రెస్సును సిద్ధం చేశారు. ఈ క్లాసిక్ బ్లాక్ సూట్ పై ప్రత్యేకంగా అల్లు అర్జున్ పేరును సూచించేలా ఆంగ్లంలో AA అనే అక్షరాలతో కూడిన మోనోగ్రామ్ ను అందంగా ఎంబ్రాయిడరీ చేశారు. కాగా, ఈ మెగా దీపావళి వేడుకలో రామ్ చరణ్, నిహారిక, చైతన్య, సుస్మిత, ఉపాసన, వైష్ణవ్ తేజ్, అల్లు వెంకటేశ్, శ్రీజ తదితరులు పాల్గొన్నారు.