బద్వేలు ఉప ఎన్నిక గెలుపుపై సీఎం జగన్ స్పందన
- బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ ఘనవిజయం
- 90 వేలకు పైగా మెజారిటీతో నెగ్గిన డాక్టర్ సుధ
- హర్షం వ్యక్తం చేసిన సీఎం జగన్
- డాక్టర్ సుధమ్మకు అభినందనలు అంటూ ట్వీట్
"శాసనసభ్యురాలిగా గెలుపొందిన డాక్టర్ సుధమ్మకు అభినందనలు. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఈ ఘనవిజయం దక్కింది. ఈ గెలుపును ప్రజాప్రభుత్వానికి, సుపరిపానలకు మీరిచ్చిన దీవెనగా భావిస్తాను... ఈ క్రమంలో మరింత మంచి చేసేందుకు కృషి చేస్తాను" అంటూ సీఎం జగన్ ఉద్ఘాటించారు.