Virat Kohli: విరాట్ కోహ్లీకి అండగా నిలిచిన రాహుల్ గాంధీ

Rahul Gandhi supports Virat Kohli
  • టీ20 ప్రపంచకప్ లో వరుసగా ఓడిపోయిన భారత్
  • కోహ్లీపై వెల్లువెత్తుతున్న విమర్శలు
  • వారి మనసులు ద్వేషంతో నిండిపోయాయన్న రాహుల్
టీ20 ప్రపంచకప్ లో టీమిండియా వరుసగా ఓటమిపాలైన నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ తో, రెండో మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. మరోవైపు కోహ్లీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అండగా నిలిచారు. ట్విట్టర్ ద్వారా రాహుల్ స్పందిస్తూ...
'నిన్ను విమర్శిస్తున్న వారందరి మనసులు ద్వేషంతో నిండిపోయాయి. ఎందుకంటే వారికి ఎవరూ ప్రేమను పంచడం లేదు. వాళ్లను క్షమించు. జట్టును రక్షించుకో' అని వ్యాఖ్యానించారు.
Virat Kohli
Team India
Rahul Gandhi
Congress
T20 World Cup

More Telugu News