badvel: బద్వేల్ ఉప ఎన్నిక‌ ఫలితాలు: జ‌గ‌న్ రికార్డును బద్దలు కొడుతూ భారీ ఆధిక్యంతో డాక్టర్ సుధ గెలుపు

sudha wins badwel election
  • వైసీపీ అభ్య‌ర్థి సుధ‌కు 1,12,072 ఓట్లు
  • బీజేపీ అభ్య‌ర్థికి 21,661 ఓట్లు
  • సుధకు 90,411 ఓట్ల మెజార్టీ
  • గ‌త అసెంబ్లీ  ఎన్నిక‌ల్లో వైఎస్ జ‌గ‌న్ కు 90,110 ఓట్ల మెజార్టీ
ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నిక‌ ఫలితాలు వెలువ‌డ్డాయి.  మొత్తం ఓట్లు 1,46,545 ఉండ‌గా, వాటిలో వైసీపీ అభ్య‌ర్థికి రికార్డు స్థాయిలో 1,12,072 ఓట్లు ప‌డ్డాయి. బీజేపీ అభ్య‌ర్థికి 21,661 ఓట్లు, కాంగ్రెస్ అభ్య‌ర్థికి 6,217, నోటాకు 3,629 ఓట్లు పోల‌య్యాయి.  

ఈ ఉప ఎన్నికలో అత్య‌ధిక మెజార్టీ సాధించి వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ దాస‌రి సుధ.. వైఎస్ జ‌గ‌న్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టారు. సుధ 90,411 ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. గ‌త అసెంబ్లీ   ఎన్నిక‌ల్లో వైఎస్ జ‌గ‌న్ 90,110 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విష‌యం తెలిసిందే. దీంతో జ‌గ‌న్ రికార్డును సుధ ఇప్పుడు అధిగ‌మించారు. గ‌త‌ ఎన్నిక‌ల్లో దాస‌రి సుధ‌ భ‌ర్త వెంక‌ట సుబ్బ‌య్య ఇదే బ‌ద్వేలు నుంచి 44,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
badvel
YSRCP
BJP

More Telugu News