'నా మ‌న‌వ‌రాలు న‌న్ను తాళ్ల‌తో క‌ట్టేసింది'.. అంటూ క్యూట్ ఫొటో పోస్ట్ చేసిన ర‌ఘువీరారెడ్డి

02-11-2021 Tue 11:31
  • ప్ర‌స్తుతం అనంత‌పురంలో వ్య‌వ‌సాయ ప‌నులు చేసుకుంటోన్న ర‌ఘువీరా
  • మ‌న‌వ‌రాలు స‌మైరాతో హాయిగా ఆడుకుంటోన్న నేత‌
  • ఇంట్లో నుంచి వెళ్ల‌కుండా త‌న‌తో ఆడుకోవాలంటూ క‌ట్టేసిందంటూ వ్యాఖ్య‌
Raghuveera Reddy my grand daughter Samaira tied me up to a pillar and demanded that I stay at home to play with her
ఏపీసీసీ మాజీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ ఆసక్తిక‌ర ఫొటో పోస్ట్ చేశారు. ఇందులో ఆయ‌న‌ను ఎవ‌రో తాళ్ల‌తో క‌ట్టేసిన‌ట్లు ఉంది. త‌న‌ను త‌న మ‌న‌వరాలే ఇలా క‌ట్టేసింద‌ని, ఇంట్లో నుంచి వెళ్ల‌కుండా త‌న‌తో ఆడుకోవాల‌ని చెప్పింద‌ని ర‌ఘువీరారెడ్డి తెలిపారు.  
                                       
ప్ర‌స్తుతం ఆయ‌న‌ రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటోన్న విష‌యం తెలిసిందే. అనంతపురంలోని త‌న సొంత గ్రామంలోనే కుటుంబ స‌భ్యుల‌తో కలసి ఉంటున్నారు. ఆయ‌న ఓ రైతులా వ్యవసాయ పనులు చేసుకుంటోన్న ఫొటోలు కూడా గ‌తంలో వైర‌ల్ అయ్యాయి.  

ర‌ఘువీరారెడ్డి  తన ట్విట్ట‌ర్ ఖాతాలో అప్పుడ‌ప్పుడు త‌న మ‌న‌వరాలి క్యూట్ ఫొటోల‌ను పోస్ట్ చేస్తుంటారు. త‌న‌ మ‌న‌వ‌రాలు పేరు సమైరా అని ఆమెతో ఆడుకుంటూ సంతోషంగా జీవితాన్ని గ‌డుపుతున్నాన‌ని ఆయ‌న ప‌లుసార్లు చెప్పారు. తాజాగా కూడా ఆమె గురించే ర‌ఘువీరారెడ్డి వివ‌రించారు.

ఇందులో ఆయ‌న ఎప్ప‌టిలాగే తెల్ల‌గ‌డ్డంతో ఉన్నారు. తెల్ల దుస్తుల్లో ఆయ‌న అమాయ‌కంగా క‌న‌ప‌డుతోన్న తీరు అల‌రిస్తోంది. త‌న మ‌న‌వ‌రాలితో క‌లిసి సైక్లింగ్ చేసిన వీడియోను కూడా ఆయన ఇటీవ‌లే పోస్ట్ చేశారు.