Goutham Sawang: ఆంధ్రా-ఒడిశా బోర్డర్ లో గంజాయి సాగుకు నక్సల్స్ సహకారం ఉంది: డీజీపీ గౌతమ్ సవాంగ్

DGP Goutham Sawang talks about Ganja cultivation and trafficking
  • మాదకద్రవ్యాలపై స్పందించిన డీజీపీ
  • ఇతర రాష్ట్రాలతో కలిసి పనిచేస్తామని వెల్లడి
  • సమాచారం ఇచ్చిపుచ్చుకుంటామని వివరణ
  • 'ముంద్రా' డ్రగ్స్ తో ఏపీకి సంబంధం లేదని పునరుద్ఘాటన
డ్రగ్స్, గంజాయి అంశంపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మరోసారి స్పందించారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో గంజాయి సాగుకు నక్సల్స్ సహకారం ఉందని ఆరోపించారు. గంజాయి రవాణా అరికట్టేందుకు ఇతర రాష్ట్రాలతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. గంజాయి రవాణాపై సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. ముంద్రా పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ కు, ఏపీకి సంబంధం లేదని పదేపదే చెబుతున్నామని స్పష్టం చేశారు. ముంద్రా పోర్టు డ్రగ్స్ పై ఇంకా అవాస్తవాలు చెప్పడం సరికాదని అన్నారు.
Goutham Sawang
DGP
Ganja
Drugs
Andhra Pradesh

More Telugu News