Pawan Kalyan: జనసేన క్రియాశీలక కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan handed over insurance cheque to deceased party worker famly
  • ఓ ప్రమాదంలో మరణించిన పిల్లా శ్రీను
  • శ్రీను అనకాపల్లి నియోజకవర్గానికి చెందిన జనసైనికుడు
  • శ్రీను మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన పవన్
  • ఆయన కుటుంబ సభ్యులకు ఓదార్పు
ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో జనసేన క్రియాశీలక కార్యకర్త పిల్లా శ్రీను ప్రాణాలు కోల్పోయారు. అతను విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గానికి చెందిన జనసైనికుడు. అతని మృతి పట్ల పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పిల్లా శ్రీను కుటుంబ సభ్యులను పవన్ కల్యాణ్ ఓదార్చారు. వారికి రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును స్వయంగా అందజేశారు. జనసేన క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వాల నమోదును ఇటీవలే పూర్తి చేసిన పార్టీ హైకమాండ్... వారికి ప్రమాద బీమా సౌకర్యాన్ని కూడా కల్పించడం తెలిసిందే.
Pawan Kalyan
Pilla Srinu
Insurance
Party Worker
Janasena
Anakapalli

More Telugu News